close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సూర్యప్రతాపం... లేత ప్రకాశం!

మండుటెండల వేళ... సొగసునిచ్చే పేస్టల్‌ రంగులు.. పూల ప్రింట్లు పరుచుకున్న దుస్తులు  చక్కటి ఎంపిక. ఏటా వేసవిలో వీటి సందడి మొదలైనా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు, సరికొత్త రంగులు... మనసు  దోచుకుంటున్నాయి.  వాటిల్లో ఏవి మనకు నప్పుతాయో తెలుసుకుందామా!
ముదురు పసుపు, బంగారు వర్ణం, గులాబీ, నారింజ రంగులు.. ఈ కాలానికి చక్కగా ఉంటాయి. అయితే ఇప్పుడు అందరి చూపూ పేస్టల్‌ రంగులపై పడింది. కాబట్టి వాటిల్లోనే లేలేత వర్ణాలను ఎంచుకోవచ్చు. ఇవి చూడ్డానికి ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఎవరు వేసుకున్నా ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ కాలంలో అవి బ్రీజీ లుక్‌తో ఉండి.. శరీరానికి చల్లదనాన్నిస్తాయి. కళాశాలకైనా.. కార్యాలయానికైనా బాగా నప్పుతాయి. అన్ని వయసుల వారికీ బాగుంటాయి. ఈ పేస్టల్‌ రంగుల్లో తీర్చిదిద్దిన షర్ట్స్‌, ట్యూనిక్స్‌, వెయిస్ట్‌కోట్లు... సహజమైన లుక్‌ని తెచ్చి పెడతాయి.  పేస్టల్‌ రంగులు కాస్త లావుగా ఉండే వారికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ రంగులో 2, 3 పీసెస్‌ డ్రెస్‌ని వేసుకున్నప్పుడు జతగా ముదురు రంగులో ఉండేలా ఒక దాన్ని ఎంచుకుంటే... ట్రెండీగా కనిపించొచ్చు. అంటే పేస్టల్‌ కలర్‌ కుర్తీ లేదా టాప్‌ని ఎంచుకుంటే దానికి జతగా ముదురు రంగు జీన్స్‌, లెగ్గింగులు, స్కర్ట్‌లు ప్రయత్నించాలి.
ప్రింట్ల విషయానికొస్తే: ఈ కాలంలో చల్లదనాన్నిచ్చేలా తెల్లని, సాదా దుస్తులు ఎంచుకోవడానికి అందరూ ఇష్టపడతారు. అయితే వాటికి తోడు... ఆహ్లాదంగా కనిపించే పూల ప్రింట్లు, డిజైన్లూ చాలా బాగుంటాయి. పేస్టల్‌ రంగుల దుస్తులకు పూల ప్రింట్లు సరిజోడి. ఈ తరహా దుస్తులు హుందా లుక్‌ని తెచ్చిపెడతాయి. ఒకవేళ ప్లెయిన్‌ కలర్‌లో డ్రెస్‌ని ఎంచుకుంటే దాని మీదకు పూల డిజైను స్కార్ఫ్‌ చక్కటి ఎంపిక. ఈ తరహాలో డిజైన్‌ చేసిన చీరలు, షర్ట్స్‌, ఏ-లైన్‌ స్కర్ట్స్‌, కుర్తాలు, పొడవాటి గౌన్లు... హుందాగా ఉంటాయి. ఫ్లోరల్‌ ప్రింట్‌ అనార్కలీలు, స్కర్ట్‌లు ఈ కాలానికి నప్పుతాయి. ఇవి పార్టీవేర్‌లానూ నప్పుతాయి. వాటికి తోడు... బాటమ్‌ వేర్‌ ఎంపికకు కూడా అంతే ప్రాధాన్యమివ్వాలి. కలంకారీ కాటన్‌తో యోక్‌ పార్ట్‌ని డిజైన్‌ చేసి కింద భాగంలో ఫ్లోరల్‌ షిఫాన్‌ కాఫ్‌లెంగ్త్‌ అనార్కలీలా కుట్టించుకుంటే ఆ అందమే వేరు.

ఆభరణాలు...: ఈ తరహా దుస్తులు ధరించినప్పుడు... ఆభరణాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం మంచిది. పూల ప్రింట్లు కాస్త ఎక్కువగా ఉంటే.. లుక్‌ హెవీగానే అనిపిస్తుంది. అందుకే చెవులకు స్టడ్స్‌ లేదా.. పొడవాటి జుంకాలు ధరించొచ్చు. మెడలో సింపుల్‌గా కనిపించే సిల్వర్‌ గొలుసు లేదంటే.. విశాలమైన మెడ భాగం ఉన్నప్పుడు ఏమీ ధరించకపోయినా ఫర్వాలేదు. ఇక హీల్స్‌ ఇలాంటి దుస్తులపైకి ఎంతో బాగుంటాయి. ఇవేవీ కాదనుకుంటే సాదా డ్రెస్‌ల మీదకు ఫ్లోరల్‌ డిజైన్‌, ప్రింటెడ్‌ జ్యూయలరీ మెప్పిస్తుంది.

 


మరిన్ని