close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సైకిల్‌పై... చల్‌ చలో చలో!

తక్కువ దూరాలకు వెళ్లేటప్పుడు, చిన్న చిన్న పనులకు కూడా ద్విచక్ర వాహనాన్నో లేదా కారునో వినియోగించే బదులు... సైకిల్‌ని ప్రయత్నించండి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

* కణాల సామర్థ్యం పెరుగుతుంది. కణాల పనితీరు మెరుగైతే మరింత ఉత్సాహంగా తయారవుతారు. వార్థక్యపు ఛాయలు కూడా దూరం అవుతాయి మెదడు సామర్థ్యం పెరిగి అల్జిమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.  మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకూ కూడా దూరంగా ఉండొచ్చు.
* గంటసేపు సైకిలు తొక్కడం వల్ల 400 నుంచి 1000 కెలోరీల శక్తి ఖర్చవుతుంది. జీవక్రియల వేగం పెరిగి ఉత్సాహంగా ఉంటాం. కండరాలను దృఢంగా చేసి కొవ్వును కరిగిస్తుంది.
* అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. శరీరావయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె కండరాలు బలంగా మారుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
* మానసిక ఆనందం కూడా సొంత మవుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
* రోజూ అరగంట సైకిల్‌ తొక్కేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. పేగు, రొమ్ము క్యాన్సర్‌ కూడా దరిచేరవట.


మరిన్ని