close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇన్‌స్టాగ్రామ్‌లో యోగా గురు!

వాళ్లు ఎన్ని ఎదురైనా నిలదొక్కుకుంటేనే విజయం అంటుంది నటాషా నోయెల్‌. ఒకప్పుడు ఆమె సగటు అమ్మాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సెన్షేషన్‌. యోగా నేర్పిస్తూ రెండులక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుందీ యోగిని.  నటాషాది ముంబయి. ఆమెకు మూడేళ్లున్నప్పుడే తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఏడేళ్లకే లైంగికవేధింపులు ఎదుర్కొంది. మౌనంగా రోదిస్తూనే తనంతట తాను నిలదొక్కుకోవడం మొదలుపెట్టింది. డ్యాన్స్‌ నేర్చుకుంది. ఫొటోగ్రాఫర్‌ అయ్యింది. డ్యాన్సర్‌గా ఐదేళ్లు పనిచేసింది. మోకాళ్లకు గాయం కావడంతో మానేసింది. ఫిజియోథెరపీలో భాగంగా ఎన్నో వ్యాయామాలు చేసింది. వాటికి యోగాసనాలు జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం మొదలుపెట్టింది.  తక్కువ సమయంలోనే ఫాలోవర్ల సంఖ్య పెరిగి లక్షలకు చేరుకుంది.


మరిన్ని