close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
న్యాప్‌కిన్ల తయారీలో ఖైదీలు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని కొన్ని జైళ్లు మహిళా ఖైదీల కోసం వినూత్న కార్యక్రమాలను చేపట్టాయి. దిల్లీలోని తీహార్‌ జైలు, అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలు...  నెలసరిలో మహిళలు పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహనతోపాటు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి.

దిల్లీలోని తీహార్‌ జైలు యూనిట్‌-6లో మహిళా ఖైదీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా శానిటరీ ప్యాడ్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఇందులో మహిళా ఖైదీలకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తారు. దిల్లీకి చెందిన ‘పహల్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి మూడు యంత్రాలతో ఓ యూనిట్‌ను వీరికి అందించింది. ‘పహల్‌ అందించిన ప్రొడక్షన్‌ యూనిట్‌ స్థాపనతో మా జైలుతోపాటు మిగతా జైళ్లలోని మహిళలకు మేలు జరుగుతుంది. మేం తయారుచేసిన బయోడిగ్రేడబుల్‌ శానిటరీ న్యాప్‌కిన్లను మార్కెట్‌లో కూడా అమ్ముతాం’ అని చెబుతున్నారు జైలు సూపరింటెండెంట్‌ సరితా సబర్వాల్‌. మహిళా ఖైదీలు తయారుచేస్తున్న ఈ న్యాప్‌కిన్లు తొంభై రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. ఆరు న్యాప్‌కిన్లు ఉండే ఈ ప్యాక్‌ ధర రూ.26. మహిళా ఖైదీలకు మాత్రం వీటిని ఉచితంగా ఇస్తారు. మిగతా వారు కొనుక్కోవాల్సిందే. ఫెమ్‌ప్రైడ్‌ పేరుతో ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

మొక్కజొన్నపిండితో...
అహ్మదాబాద్‌లోని సబర్మతీ జైలు అధికారులు కూడా మహిళా ఖైదీల కోసం శానిటరీ న్యాప్‌కిన్ల యూనిట్‌ను ప్రారంభించారు. ‘కర్మ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ శానిటరీ న్యాప్‌కిన్ల తయారీ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. ‘మొక్కజొన్న పిండిని ఉపయోగించి చేసే ఈ ప్యాడ్‌లు     పర్యావరణహితమైనవి. పూర్తిగా భూమిలో కలిసిపోతాయి. ప్రతి ప్యాక్‌లో ఎనిమిది న్యాప్‌కిన్లు ఉంటాయి. వీటి ధర 18 నుంచి 20 రూపాయలు ఉంటుంది. అయితే రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు మాత్రం వీటిని ఉచితంగా అందిస్తాం’ అని చెబుతారు ఎన్జీవో
ముఖ్య  అధికారి.


మరిన్ని