close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
శుద్ధి చేసే వాటర్‌ క్యాబేజీ

ఇంట్లో ఎన్ని మొక్కలున్నా... నీళ్లల్లో తేలాడేవి లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అలాంటిదే వాటర్‌ క్యాబేజీ. ఇది చూడ్డానికి పువ్వులా ఉండి.... పెంచే ప్రదేశానికి ఆకర్షణ తెచ్చి పెడుతుంది. మరి దీన్ని ఎలా పెంచుకోవాలో చూద్దామా...

బృందావనం
వాటర్‌ క్యాబేజీనే వాటర్‌ లెట్యూస్‌ అని కూడా అంటారు. ఇది నీళ్లల్లో పెరిగే మొక్క. పొడవుగా వేలాడే ఈకల్లాంటి వేళ్ల సాయంతో ఈ మొక్క నీళ్లలో తేలుతూ ఉంటుంది. ఈ వేళ్లు దాదాపు అరమీటరు పొడవులో పెరుగుతాయి. ఈ మొక్క కాస్త దళసరిగా, కాస్త మెత్తగా పువ్వు ఆకృతిలో, ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. దీనికి కాండం ఉండదు. దీని శాస్త్రీయ నామం పిస్టియా స్ట్రాటియోటిస్‌. ఈ మొక్క ఆకులు సన్నటి నూగుతో ఉంటాయి. దీనికి చిన్న చిన్న పూలు పూస్తాయి. కానీ అవి ఆకుల మధ్య సరిగా కనిపించవు. గాజు పాత్రల్లో పెంచుకుంటే బాగుంటుంది. అక్వేరియంలలో కూడా పెంచుకోవచ్చు. దీన్ని కొత్తగా పెంచాలనుకున్నప్పుడు కొద్దిపాటి నీడలో ఉంచిన తరువాత ఎండలోకి మార్చాలి. ఎండ సరిగా తగలకపోయినా, గాలిలో తేమ తక్కువగా ఉన్నా సరిగా పెరగదు. మొక్క ఆరోగ్యంగా ఎదగాలంటే ఎప్పటికప్పుడు ఎండిపోయిన, పసుపు రంగు ఆకులను తీసేయాలి. ఈ మొక్క పూర్తి ఎండలోనే కాకుండా కొద్దిపాటి నీడలో కూడా పెరగగలదు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఎదుగుతుంది. క్రమంగా పిలకలు పెరిగి తొట్టి అంతా నిండుగా కనిపిస్తుంది. ఈ పిలకలు స్టోలన్‌లనే కాడల ద్వారా తల్లిమొక్కకు అంటుకుని ఉంటాయి. వీటిని విడదీసి కొత్త మొక్కలుగా పెంచుకోవచ్చు. ఈ మొక్క నీటిలో నుంచి అదనంగా ఉన్న నత్రజని, భాస్వరం, భార ఖనిజాలను తొలగించి శుద్ది చేయగలదు. ఈ ఆకులకు క్రిమి సంహారక లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కను పెంచుకోవడం అదృష్టానికి ప్రతీకగా నమ్ముతారు. ఆయుర్వేదం ప్రకారం దీనిలో అనేక ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి.


మరిన్ని