close

తాజా వార్తలు

యువజంట సజీవ దహనం

కొత్తగూడెం, భద్రాద్రి: అనుమానాస్పద స్థితిలో ఓ యువజంట సజీవ దహనమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాంజనేయకాలనీలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్న వినోద్‌(24), తేజస్విని(17) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు పూర్తిగా మంటలలో కాలిపోయారు. చుంచుపల్లి సీఐ కరుణాకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు