close

తాజా వార్తలు

సరిహద్దుల్లో కాల్పులు.. సైనికుడు మృతి

శ్రీనగర్ : సరిహద్దులో పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ఓ భారత సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ, సుందర్‌బనీ సెక్టార్‌లో సోమవారం ఉదయం పాకిస్థాన్‌ సైనికులు చిన్నపాటి ఆయుధాలు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారని రక్షణ బలగాల అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేంద్ర ఆనంద్‌ తెలిపారు. ఈ కాల్పులను భారత  సైన్యం దీటుగా తిప్పికొట్టిందన్నారు. ఇదే తరహాలో ఆదివారం ఉదయం కూడా పాక్‌ బలగాలు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పడంతో తోకముడిచాయి. పుల్వామా, బాలాకోట్‌ ఘటనల తరవాత పాక్‌ సైన్యం నియంత్రణా రేఖ వెంట తరచూ కాల్పుల  విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. మోర్టార్లు, చిన్నపాటి ఆయుధాలతో సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు