close

తాజా వార్తలు

మీ ఏడు సీట్లు మాకేం వద్దు: మాయావతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ- సమాజ్‌వాదీ పార్టీ కూటమి కోసం తాము ఏడు సీట్లు వదిలేస్తున్నామంటూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. తమకి ఆ ఏడు సీట్లు వద్దని, భారతీయ జనతా పార్టీని తమ కూటమి ఒంటరిగానే ఓడిస్తుందని ఆమె అన్నారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 80 స్థానాల్లో పోటీ చేయడానికి తమ అభ్యర్థులను బరిలోకి దింపుకోవచ్చు. భాజపాను ఓడించే సామర్థ్యం మా కూటమికి ఉంది. బీఎస్పీ-ఎస్పీ కూటమి కోసం ఏడు సీట్లు వదిలేస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూ పలు రకాల వదంతులను వ్యాప్తి చేయొద్దు’ అని ఆమె కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

‘ఈ సందర్భంగా బీఎస్పీ మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకోలేదు.. ఈ విషయంపై ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తున్న వదంతులను ప్రజలు పట్టించుకోవద్దు’ అని మాయావతి మరో ట్వీట్‌ చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో బీఎస్పీ పొత్తు కుదుర్చుకుంది. అయితే, తాము కాంగ్రెస్‌ పార్టీ కోసం రెండు సీట్లను (రాయ్‌బరేలీ, అమేథీ) వదిలేశామని, తమ మహాకూటమిలో కాంగ్రెస్‌ కూడా ఉందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ పలుసార్లు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తాము కూడా బీఎస్పీ-ఎస్పీ కోసం ఏడు సీట్లు వదిలేస్తున్నామంటూ ప్రకటించింది. 

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు