close

తాజా వార్తలు

నానమ్మ పుట్టింది ఈ గదిలోనే: ప్రియాంక

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ట్విటర్‌ వేదికగా తన నానమ్మ ఇందిరా గాంధీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు. మూడు రోజుల ‘గంగా యాత్ర’తో ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారానికి స్వీకారం చుట్టారు ఈ కాంగ్రెస్ నాయకురాలు. దానిలో భాగంగా ఆమె ఆదివారం ప్రయాగ్‌ రాజ్‌లోని పూర్వికులకు చెందిన స్వరాజ్ భవన్‌లో బస చేశారు. అక్కడే మాజీ ప్రధాని ఇందిర జన్మించారు. ఆ గదికి సంబంధించిన చిత్రాన్ని ప్రియాంక షేర్ చేశారు.

‘స్వరాజ్‌ భవన్‌లో మా దాది జన్మించిన గదిని చూడగలిగాను. నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని తరచుగా జోన్‌ ఆఫ్ ఆర్క్ కథలు చెప్తుండేది. ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ హృదయంలో మారుమోగుతూనే ఉన్నాయి. ‘ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది’ అని ఎప్పుడూ చెప్తుండేవారు’ అని ప్రియాంక ట్వీట్ చేశారు. స్వరాజ్‌ భవన్‌లో నవంబరు 19, 1917లో ఇందిర జన్మించారు. తన బాల్యంలో కొంతకాలాన్ని అక్కడే గడిపారు. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రంలో గోడకు తగిలించిన ఇందిర చిన్ననాటి ఫొటో కూడా కనిపిస్తుంది. అందులో ఆమె జాతిపిత మహాత్మా గాంధీ పక్కన కూర్చొని కనిపిస్తున్నారు.

గంగాయాత్రలో భాగంగా ప్రియాంక మొత్తం 140 కిలోమీటర్లు స్టీమర్‌లో ప్రయాణించి, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలతో మాట్లాడనున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు