close

తాజా వార్తలు

ధోనీ సలహాలు పాటిస్తే మంచిది: రిషభ్‌పంత్‌

దిల్లీ: ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ రిషభ్‌పంత్‌కు చేదు అనుభవం మిగిల్చింది. ప్రపంచకప్‌లో చోటుకల్పించేందుకు టీమిండియా యాజమాన్యం యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచులకు అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆటగాడు రిషభ్‌పంత్‌. ఆశించినమేర రాణించలేకపోగా నాలుగో మ్యాచ్‌లో చేసిన తప్పిదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణపై దిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు తాజాగా ఓ క్రికెట్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ సందర్భంగా పంత్‌ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో ఆడాలని తన మదిలో ఎప్పటికీ ఉంటుందని చెప్పాడు. అయితే ప్రస్తుతం తన ధ్యాసంతా ఐపీఎల్‌ మీదే ఉందని, దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుని విజేతగా చూడాలనుకుంటున్నాని పేర్కొన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక ఆటగాడిగా ప్రతీరోజూ మెరుగ్గా రాణించాలనే అనుకుంటా. ఇప్పటికే నా తప్పిదాలను కొన్నింటిని గమనించా. వాటిపై దృష్టిపెట్టాలి. నా తప్పిదాల గురించి ఇప్పటికే ధోనీని కలిసి మాట్లాడాను. డ్రెస్సింగ్‌ రూంలో ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడిని కలిసి ఏదైనా మాట్లాడొచ్చు. ప్రతీ ఒక్క ఆటగాడితో ధోనీ అలాగే ఉంటాడు. అందరినీ కలుపుకొని పోతాడు. దీంతో అతడు నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. అవి పాటిస్తే మంచిది. లేదా ఎవరిష్టం వారిది’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు.
 

కాగా ఈనెల 23 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో పాల్గొనేందుకు రిషభ్‌పంత్‌ ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో కలిసిపోయాడు. ఆ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఒకవేళ ఐపీఎల్‌లో రాణిస్తే టీమిండియా తరఫున రెండో వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఇంగ్లాండ్‌ విమానమెక్కే వీలుంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు