close

తాజా వార్తలు

మరో 4 జెట్‌ఎయిర్‌వేస్‌ విమానాల రద్దు..

 

ముంబయి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ఎయిర్‌వేస్‌ మరో నాలుగు విమానాలను పక్కనపెట్టింది. దీంతో లీజులు చెల్లించలేక పక్కన పెట్టిన జెట్‌ఎయిర్‌వేస్‌ విమానాల సంఖ్య 41కు చేరింది. ‘‘ అదనంగా మరో నాలుగు విమానాలను పక్కన పెట్టాము. ఇప్పటికే వాటికి చెల్లించాల్సిన మొత్తాలు భారీగా పేరుకుపోయాయి.లీజుదారులు కూడా కంపెనీకి పూర్తిగా సహకరిస్తున్నారు.’’ అని స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి అందజేసిన సమాచారంలో పేర్కొంది. ఇప్పటికే జెట్‌ఎయిర్‌వేస్‌ లీజుదారులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు నగదు సేకరణ సమాచారం అందజేస్తోంది. ప్రస్తుతం జెట్‌ఎయిర్‌వేస్‌ వద్ద మొత్తం 119 విమానాలు ఉన్నాయి. 
ఈ నెల మొదట్లో జెట్‌ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌ మాట్లాడుతూ తమ 50 విమానాలను పక్కన పెట్టనున్నట్లు వెల్లడించారు. నగదు సమస్య కారణంగా లీజు మొత్తాల చెల్లింపులో జాప్యం జరుగుతుందని  ఆ కంపెనీ పేర్కొంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు