close

తాజా వార్తలు

పబ్‌జీ గేమ్‌ ఆడుతూ ఇద్దరు మృతి

ముంబయి: పబ్‌జీ ఆటలో నిమగ్నమై ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హింగోలిలోని ఖట్‌కలి బైపాస్‌ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నగేశ్‌ గోరి(24), స్వప్నిల్ అన్నపూర్ణె (22) అనే ఇద్దరు యువకులు హింగోలి సమీపంలోని రైలు పట్టాలకు సమీపంలో పబ్‌జీ గేమ్‌ ఆడుకుంటున్నారు. ఆటలో మునిగి రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదు. అదే సమయంలో అటు నుంచి వేగంగా వస్తున్న హైదరాబాద్‌- అజ్మేర్‌ రైలు వీరిని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన కొన్ని ఘంటల తరువాత స్థానికులు మృతదేహాలను గుర్తించి తమకు సమాచారమందించారని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పబ్‌జీ గేమ్‌ వల్ల తమ పిల్లలు ప్రవర్తన మారుతోందని, దీన్ని నిషేధించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు