close

తాజా వార్తలు

నా సినిమాను థియేటర్‌లో చూసుకోలేకపోయాను

ఏడుపొచ్చేసింది: భాగ్యశ్రీ

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సానీ తన తొలి చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’ అనే చిత్రంలో అభిమన్యు కథానాయకుడిగా నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాను ఇటీవల మామి ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారట. రెండు థియేటర్లలో ఈ సినిమా ప్రీమియర్‌ షోను ప్రదర్శించగా హౌస్‌ఫుల్‌ అయిపోయిందట. అది చూసి ఆనందంతో తనకు ఏడుపొచ్చేసిందని భాగ్యశ్రీ అన్నారు. తన కుమారుడి సినిమా గురించి ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అభిమన్యు నటించిన సినిమాను ప్రీమియర్‌ షో వేస్తే రెండు థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. స్పందన చూసి మరో ఐదు థియేటర్లలో ప్రదర్శించారు. నాకు ఏడుపొచ్చేసింది. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం నేను నటించిన నా సినిమాలను థియేటర్‌లో చూసుకోలేకపోయాను. ఇప్పుడు నా కుమారుడి సినిమాల ద్వారా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను’ అని వెల్లడించారు. సినిమా విడుదల కాకముందే అభిమన్యు ఉత్తమ పరిచయ నటుడిగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అవార్డు అందుకున్నారు. వాసన్‌ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు