close

తాజా వార్తలు

పౌరులకు రక్షాకవచాలు ఈ బంకర్లు

జమ్ము కశ్మీర్: శత్రుదేశం పాకిస్థాన్‌ సైన్యం, ఉగ్రవాదులు జరిపే కాల్పుల నుంచి దేశ పౌరులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం బంకర్ల నిర్మాణం విరివిగా చేపట్టింది. సరిహద్దు రేఖ వెంబడి ఈ బంకర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌పై భారత్‌ వైమానిక మెరుపు దాడి జరిపిన తర్వాత నుంచి సరిహద్దు వెంబడి పాక్‌ సైన్యం తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే వస్తోంది. ఆ కాల్పుల్లో సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకపక్క కరాచిలోని పోర్టులో పాక్‌ యుద్ధ నౌకలు కనిపించడం లేదు. పాక్‌ అణ్వాయుధ క్షిపణులు దాచే ప్రదేశంలో కూడా తాజాగా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఎటువంటి ప్రమాదమైనా జరగొచ్చనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే సరిహద్దుల్లో మరిన్ని బంకర్ల నిర్మాణం చేపట్టింది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు