close

తాజా వార్తలు

మెట్టు దిగిన బీసీసీఐ!

ముంబయి: బీసీసీఐ ఎట్టకేలకు ఓ మెట్టు దిగింది! జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి ఆరు నెలలు పనిచేసేందుకు అంగీకరించింది. నిన్నటి వరకు అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ మార్గదర్శకాలను పాటించబోమని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. భారత్‌కు వచ్చిన ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌తో చర్చించిన తర్వాత బోర్డు వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.

‘ఐసీసీ, బీసీసీఐ, నాడా మధ్య ఆరు నెలల త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. బోర్డులో నమోదైన ఆటగాళ్ల శాంపిళ్లను నాడా ద్వారా జాతీయ డోప్‌ పరీక్ష పరిశోధనశాల (ఎన్‌డీటీఎల్‌)కు పంపిస్తాం. ఈ పద్ధతి మాకు  సంతృప్తికరంగా లేకుంటే ఒప్పందాన్ని పొడగించబోము’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు.  ఈ విషయం ఇంకా నాడాకు చెప్పలేదు. ‘రాతపూర్వకంగా అంగీకారం వచ్చిన తర్వాతే ఏదైనా మాట్లాడగలను. ఇంకా నాకు ఏ విషయం చెప్పలేదు’ అని నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ తెలిపారు.

నాడాపై తమకు నమ్మకం లేదని బీసీసీఐ వెల్లడించింది. ‘నాడా డోప్‌ నియంత్రణ అధికారుల (డీసీఓ) పై మాకు విశ్వాసం లేదు. వీరు సరిగ్గా పనిచేయని ఉదంతాలెన్నో మాకు తెలుసు. మా వద్ద విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీ వంటి పలుకుబడి గల ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటప్పుడు వారినెలా (డీసీఓ) విశ్వసించగలం. నిబంధనల ప్రకారం పంపాల్సిన కనీసమైన 10 శాతం నమూనాలనే మేం పంపిస్తాం. వీటిలో టాప్‌ క్రికెటర్లు, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లవీ ఉంటాయి’ అని బీసీసీఐ వెల్లడించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు