close

తాజా వార్తలు

చివరి నిమిషంలో ఎరిక్సన్‌కు చెల్లింపులు

దిల్లీ: రిలయన్స్ కమ్యునికేషన్‌(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీకు ఊరట లభించింది. సుప్రీం కోర్టు విధించిన మార్చి 19 గడువులోగానే స్వీడిష్‌  కంపెనీ ఎరిక్సన్‌కు రూ.458.77 కోట్లు చెల్లించారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ చెల్లింపుల్లో ఆలస్యం జరిగినట్లయితే ఆయన మూడు నెలలు కారాగార అనుభవించాల్సి వచ్చేది. దీంతో రెండు కంపెనీల మధ్య సంవత్సర కాలంగా కొనసాగుతోన్న న్యాయపోరాటానికి తెరపడిందని సమాచారం. 

ఎరిక్సన్‌కు చెల్లింపుల విషయంలో ఆర్‌కామ్ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని సుప్రీం నిర్ధరించి, అనిల్‌ అంబానీకి రూ. కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. అలాగే ఎరిక్సన్‌కు నాలుగు వారాల్లో బకాయిలు  చెల్లించాలని, లేకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ఆదేశించింది. అయితే ఆర్‌కామ్ చెల్లింపులకు సంబంధించి ఎరిక్సన్‌ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు