close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో 2 పాయింట్లు పోయినా ఫర్వాలేదు..

న్యూదిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాలా? వద్దా? అన్న విషయంపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లోనూ పాక్‌తో టీమిండియా ఆడొద్దని డిమాండ్ వస్తోంది. అయితే, ఇతర విషయాలను క్రీడాస్ఫూర్తికి అతీతంగా ఉండాలని మరి కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

‘దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇతర విషయాలను అతీతంగా క్రీడా స్ఫూర్తి ఉండాలని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ప్రకారం.. జవాన్ల కంటే ఏదీ ముఖ్యం కాదు. పాకిస్థాన్‌పై షరతులతో కూడిన నిషేధం విధించకూడదు. ఆ దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అడ్డుకోవాల్సిందే. ఐఐసీ టోర్నమెంట్ల నుంచి పాక్‌ను బాయ్‌కాట్‌ చేయడం అంత సులుభమేమీ కాదని నాకు తెలుసు. మనం ఇప్పటికే ఆ దేశ జట్టు‌తో ధ్వైపాక్షిక సిరీస్‌లు ఆడట్లేదు. ఆసియా కప్‌లోనూ మనం పాక్‌తో ఆడకూడదని నేను భావిస్తున్నాను. పాక్‌తో ఆడకపోతే ఆ సిరీస్‌లలో మనం రెండు పాయింట్లను కోల్పోతాం. పాక్‌లో ఈ రెండు పాయింట్లను వదిలేయడానికి దేశం మొత్తం మానసికంగా సిద్ధంగా ఉంది. పాక్‌తో ఆడబోమని టీమిండియా నిర్ణయం తీసుకుని అమలు చేస్తే, ఒకవేళ మనం సెమీఫైనల్‌లోకి ప్రవేశించకపోతే అభిమానులు మన జట్టుని నిందించకూడదు. పాక్‌తో ఆడకపోవడంలో ఎటువంటి తప్పులేదని నేను అనుకుంటున్నాను. ఈ రెండు పాయింట్లు ముఖ్యం కాదు.. మనకు దేశం ముఖ్యం. 40కి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. క్రికెట్‌ కన్నా వారి ప్రాణాలే ముఖ్యం కదా’ అని వ్యాఖ్యానించాడు.   


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు