close

తాజా వార్తలు

తెలంగాణ ప్రభుత్వంతో ఓలా ఒప్పందం

హైదరాబాద్‌: ప్రముఖ రవాణా సేవా సంస్థ ఓలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ మహానగరంలో స్మార్ట్‌ ట్రాఫిక్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. రోడ్లు, రద్దీ నిర్వహణలో ప్రభుత్వానికి తోడ్పాటుగా డేటాను పంచుకోనుంది. నగరంలోని ట్రాఫిక్‌, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి అండగా నిలిచేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సమక్షంలో ఓలా సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. ఓలా అందించే విలువైన డేటా ఇన్‌సైట్స్‌ భవిష్యత్ రవాణా మౌలిక వసతులను ఏర్పరచుకునేందుకు మార్గం సుగమం చేస్తాయని అభిప్రాయపడ్డారు. వాహనాల నెట్ వర్క్ ద్వారా నగరంలోని వివిధ ప్రధాన రహదారులపై ప్రయాణ నాణ్యతను డైనమిక్ మ్యాపింగ్ చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టబోతున్నామని తెలిపారు. గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు, రోడ్డు మరమ్మతుల బడ్జెట్ ప్రాథమ్యాలను నిర్ణయించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు