close

తాజా వార్తలు

నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు:అక్షయ్

ముంబయి: తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్ స్పష్టం చేశారు. భాజపా అమృత్‌సర్‌ నియోజకవర్గంలో అక్షయ్‌ను పోటీకి దింపుతుందన్న వదంతులకు ఆయన చెక్ పెట్టారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. మీరు రాజకీయాల్లో చేరుతున్నారా అని ప్రశ్నించగా..‘రాజకీయాలు నా అజెండాలో లేవు. నేను సినిమాల ద్వారా చేస్తున్నది, రాజకీయాల ద్వారా చేయలేనని నా భావన’ అని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చౌకీదార్ క్యాంపైన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్షయ్ పేరును ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషి చేయాలంటూ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. అప్పుడు కూడా ఆయన పేరును ట్యాగ్ చేశారు. దానికి అక్షయ్ వెంటనే స్పందించారు. సామాజిక అంశాలను స్పృశించే సినిమాల్లో అక్షయ్ నటిస్తుంటారు. ఇవన్నీ ఎన్నికల సమయంలో అక్షయ్ పేరు వార్తల్లో ప్రముఖంగా నిలిచేలా చేశాయి.  


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు