close

తాజా వార్తలు

క్షమించండి.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా!

శ్రీశైలం ఎమ్మెల్యే అనూహ్య నిర్ణయం

కర్నూలు: తెదేపా నేత, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి అనూహ్య ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన భార్య శైలజ అనారోగ్య పరిస్థితులే అందుకు కారణమని ఆయన స్పష్టంచేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నందుకు పార్టీ, కార్యకర్తలు, ప్రజలు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును కలిసి తాను శ్రీశైలం నుంచి పోటీచేయలేనని చెప్పారు. ఈసారి శ్రీశైలం టిక్కెట్‌ తన సోదరుడికి ఇవ్వాలని కోరారు. అయితే, శ్రీశైలం నుంచి ఏవీ సుబ్బారెడ్డిని బరిలో దించాలని తెదేపా అధిష్ఠానం ప్రతిపాదించినట్టు సమాచారం. మహానంది, బండిఆత్మకూరు మండలాల్లో సుబ్బారెడ్డికి పట్టుంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం చేసిన ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు, బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి వైఖరిపై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వేల్పనూరులోని ఆయన నివాసం వద్ద నినాదాలు చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆందోళనకు దిగారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు