close

తాజా వార్తలు

హిట్‌ ఇచ్చిన దర్శకుడితో మరోసారి?

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ సినీ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వం వహించారు. దీని తర్వాత విజయ్‌.. నాగచైతన్య కథానాయకుడిగా ‘ఒక లైలా కోసం..’ సినిమా తీశారు. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత విజయ్‌ ఏ సినిమా కోసం పనిచేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన, నితిన్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోందని సమాచారం. ఇప్పటికే విజయ్‌ ఓ ప్రేమకథను నితిన్‌కు నరేట్‌ చేశారట. కథ హీరోకు నచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
నితిన్‌ ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు