close

తాజా వార్తలు

పెళ్లికి సమయం, వయసుతో పనిలేదు

పరిణీతి చోప్రా

ముంబయి: తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు చర్చించేందుకు సిద్ధంగా లేనని బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా తెలిపారు. ఆమె ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘కేసరి’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించారు. 1897లో జరిగిన సారాగడీ యుద్ధంలో పదివేల మంది ఆప్ఘన్‌లతో పోరాడిన 21మంది సిక్కు సైనికుల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ నెల 21న సినిమా విడుదల కాబోతోంది.
ఈ చిత్ర ప్రచారంలో భాగంగా పరిణీతి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల దర్శకుడు మనీష్‌ శర్మతో, గతంలో సహాయ దర్శకుడు చరిత్‌ దేశాయ్‌తో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తల గురించి ప్రశ్నించారు. దీనికి పరిణీతి స్పందిస్తూ.. ‘నిజంగా చెబుతున్నా.. నా ప్రేమ జీవితం గురించి మాట్లాడేందుకు నేను సిద్ధంగా లేను. ఇది సరైన సమయం కాదు. ఆ విషయం ఎప్పుడు అందరికీ తెలియాలో అప్పుడే నా నుంచి తెలుస్తుంది. నేను అన్నీ దాస్తుంటాను అనేది చాలా మంది అభిప్రాయం. కానీ అది నిజం కాదు. జీవితంలో ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అన్నీ కుదిరినప్పుడు పెళ్లి చేసుకుంటా. వివాహానికి సమయం, వయసుతో పనిలేదు. అది ఓ వ్యక్తి మెంటల్‌ స్టేట్‌ మీద ఆధారపడి ఉంటుంది. నా మానసిక పరిస్థితి పెళ్లికి సిద్ధంగా ఉంటే.. రేపే నా పెళ్లి జరగొచ్చు. లేకపోతే మరో ఐదేళ్లు ఇలానే ఉండొచ్చు’ అని చెప్పారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు