close

తాజా వార్తలు

మూడో జాబితా విడుదల చేసిన జనసేన

శాసనసభకు 13 మంది..  లోక్‌సభకు ఒకరు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్‌రియాజ్‌ తాజా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్‌నాయుడు పోటీ చేయనున్నారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. 
శాసనసభ అభ్యర్థులు వీరే..
1. టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌
2. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు
3. గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌
4. రేపల్లె: కమతం సాంబశివరావు
5. చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి
6. మాచర్ల: కె.రమాదేవి
7. బాపట్ల: పులుగు మధుసూదన్‌రెడ్డి
8. ఒంగోలు: షేక్‌ రియాజ్‌
9. మార్కాపురం: ఇమ్మడి కాశీనాథ్‌
10. గిద్దలూరు: బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌
11. ప్రొద్దుటూరు: ఇంజా సోమశేఖర్‌రెడ్డి
12. నెల్లూరు నగరం: కేతంరెడ్డి వినోద్‌రెడ్డి
13. మైదుకూరు: పందింటి మల్హోత్రా
14.కదిరి: సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు)

1. ఒంగోలు (లోక్‌సభ): బెల్లంకొండ సాయిబాబా


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు