close

తాజా వార్తలు

తెలంగాణలో పొడి వాతావరణం

ఈనాడు, హైదరాబాద్‌: ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మంగళ, బుధవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కర్ణాటక ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల అదనంగా నమోదవుతున్నాయి. సోమవారం పగలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా దోమ గ్రామంలో 39.3, మెదక్‌ జిల్లా నాగపూర్‌, నిజామాబాద్‌ జిల్లా కల్గుర్కిలో 39.2, హైదరాబాద్‌లో 33.7 డిగ్రీలుంది. హైదరాబాద్‌లో సాధారణంకన్నా 3 డిగ్రీలు తక్కువగా ఉంది. రాత్రిపూట సాధారణంకన్నా 2 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా హకీంపేటలో 18, హన్మకొండలో 20, హైదరాబాద్‌లో 21 డిగ్రీలుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు