close

తాజా వార్తలు

ఆ ఊరులో 100శాతం ఓటేస్తారు

న్యూస్‌టుడే - పత్తికొండ పట్టణం, మద్దికెర

అదో చిన్న ఊరు.. ఉన్నది కేవలం 392 మంది ఓటర్లు. అయినా ఆ ఊరి స్ఫూర్తి అందరిని ఆలోచింపజేస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని జె.అగ్రహారం గ్రామస్థులు నూటికి నూరుశాతం ఓటు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎన్నికలు రాగానే అక్కడి ప్రజలు ఠంఛనుగా ఊరికి వచ్చి ఓటు వేసి వెళతారు. చదువుకున్న వాళ్లు.. పట్టణవాసులు.. ఎన్నికల తేదీని సెలవు రోజుగా భావిస్తున్న నేటి తరుణంలో ఆ గ్రామం మాత్రం ఓటేయడాన్ని పవిత్రకార్యంగా స్వీకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామస్థులు నూటికి నూరుశాతం ఓటు వేసి స్ఫూర్తి చాటుకున్నారు.రెండు దశాబ్దాల కిందట ఊరిని పట్టిపీడిస్తున్న సారా మహమ్మారికి వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక అండగా మహిళలందరూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారి పట్టుదలతో సారా రక్కసి ఊరి నుంచి పారిపోయింది. అనంతరం గ్రామంలోని మహిళలు అక్షరాస్యత సాధించి పొదుపు సంఘాల్లో చేరి చైతన్యవంతులయ్యారు. ఓటు ప్రాముఖ్యతపై సమావేశాల్లో చర్చించి అందరితోనూ ఓటు వేయించేందుకు అవగాహన కల్పించారు.

ఒక్క ఓటూ వృథా కానివ్వం: మహాదేవి, సుంకులమ్మ గ్రూపు
గ్రామంలో 186 మంది మహిళా ఓటర్లున్నాం. ఎన్నికలకు ముందు అందరం కలిసి సమావేశమై మంచి వ్యక్తిని ఎన్నుకునేందుకు చర్చలు జరుపుతాం. అందరి అభిప్రాయాలు తెలుసుకుని ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేస్తాం. గ్రామంలో ఒక్క ఓటూ వృథా కానివ్వకుండా ఓటు వేసేలా అందర్ని ప్రోత్సహిస్తాం.

తీర్మానం
ఎన్ని పనులు ఉన్నా.. ఎక్కడికెళ్లినా ఎన్నికల సమయానికి అందరూ వచ్చి ఓటు వేయాలని ఈ గ్రామస్థులు తీర్మానించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు