close

తాజా వార్తలు

మరణంలోనూ తప్పని వెతలు

చర్ల, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం క్రాంతిపురానికి చెందిన కొందరు గోదావరి పరివాహకంలో మిరప కోతల పనులకు వెళ్లి అక్కడే తాత్కాలిక గుడారాల్లో ఉంటారు. లింగయ్య, జ్యోతి దంపతులు కూడా అలాగే వెళ్లారు. సోమవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. జ్యోతి పురుగు మందు తాగింది. 108 వాహనంలో భద్రాచలం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అదే వాహనంలో దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆదివాసీలు తెల్లవారే వరకు అక్కడే ఉన్నారు. ఆసుపత్రి నుంచి బస్టాండ్‌ సెంటర్లో ఉన్న పోస్టుమార్టం గదికి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. పోస్టుమార్టం అనంతరం 11 కి.మీ. దూరంలో ఉన్న క్రాంతిపురం గ్రామానికి కుటుంబ సభ్యులు జెట్టీలో తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. గాంధీనగర్‌ సెంటర్‌కు వచ్చాక ఎస్సై రాజువర్మ ఆటో ద్వారా ఆ మృతదేహాన్ని తరలించేందుకు చొరవ చూపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు