close

తాజా వార్తలు

విద్యార్థినులు ఇద్దరు.. సిబ్బంది 8మంది

ఆ పరీక్ష కేంద్రంలో మొత్తం ముగ్గురు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇద్దరు విద్యార్థినులే హాజరయ్యారు. వీరి కోసం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, ఇన్విజిలేటర్‌, సిటింగ్‌ స్క్వాడ్‌, ఆరోగ్య సహాయకుడు, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు ఆయాలు.. మొత్తం 8 మంది సిబ్బందిని నియమించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పదోతరగతి పరీక్షల్లో సప్లిమెంటరీ విద్యార్థుల కోసం న్యూశాతవాహన పాఠశాలలో ఏర్పాటైన పరీక్ష కేంద్రంలో.. సోమవారం నిర్వహించిన తెలుగు పేపరు-2 పరీక్ష సందర్భంగా కనిపించిన విశేషమిది. సదరు పరీక్ష కేంద్రానికి సోమవారం ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది కూడా తనిఖీకి రావడం కొసమెరుపు.

- న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ పట్టణం


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు