close

తాజా వార్తలు

స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు


ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 38,167 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,500 వద్ద ట్రేడవుతున్నాయి. మరోపక్క రూపాయి స్వల్పంగా 2పైసలు విలువ కోల్పోయి 68.55 ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత బలపడి 9.45 సమయంలో 68.42 వద్ద ట్రేడవుతోంది. 
అంతర్జాతీయ మార్కెట్లు కూడా మందకొడిగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీలు 0.5 శాతం విలువ కోల్పోగా ఆస్ట్రేలియా సూచీలు 0.1శాతం విలువ కోల్పోయాయి. 

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు