close

తాజా వార్తలు

ఆదుకుంటాను.. ఐఏఎస్‌ అధికారిని చేస్తాను

బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్‌

హైదరాబాద్‌: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఈరోజు తన 69వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్‌ ఓ బాలికను దత్తత తీసుకుని ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా మంచి పని చేయాలనుకున్నాను. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. విద్యానికేతన్‌ పాఠశాలలో తనను చేర్పించాను. పాప బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. మంచి చదువు చెప్పిస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఐఏఎస్‌ అధికారి అవ్వాలన్నది ఆ బాలిక ఆశయం. తను అనుకున్నది సాధించేందుకు సాయపడతాను’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై చంద్రశేఖర్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ.. ‘మంచి పని.. కానీ ఐఏఎస్‌ అధికారి అవ్వాలంటూ బాలికను ఒత్తిడికి గురిచేయకండి. ఇది తన కల అని తెలుసు. కానీ పాప పెద్దయ్యే కొద్ది ఆమె ఆశయాలు కూడా మారిపోతుంటాయి’ అన్నారు. ఇందుకు మనోజ్‌ సమాధానమిస్తూ.. ‘ఐఏఎస్‌ అధికారి అవ్వాలన్నది తన కోరిక బ్రదర్‌. నేనెవర్ని డిసైడ్‌ చేయడానికి? తనకు మంచి జీవితం ఇవ్వగలనని మాత్రం చెప్పగలను’ అని పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు