close

తాజా వార్తలు

‘మా గ్రామాల్లో పారికర్‌ విగ్రహం ఏర్పాటు చేయండి’

అమేఠీ: ఉత్తరప్రదేశ్‌లోని రాహుల్‌గాంధీ నియోజకవర్గం అమేఠీ పరిధిలోని బరౌలియా, హరిహరపూర్‌ గ్రామాలతో దివంగత కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రెండు గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం కింద ఆయన దత్తత తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి పారికర్‌ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన విషయం తెలిసిందే. పారికర్ మరణం పట్ల ఆ రెండు గ్రామాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యున్ని కోల్పోయినంత బాధగా ఉంది అని బరౌలియా మాజీ గ్రామ ప్రధాన్‌ సురేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రమాల్లో పారికర్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించారని తెలిపారు. ‘‘పారికర్‌ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. లేదంటే మేమే విరాళాలు సేకరించి పనులు మొదలు పెడతాం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘‘బరౌలియా, హరిహరపూర్‌ గ్రామాల అభివృద్ధికి పారికర్‌ ఎంతో కృషి చేశారు. రెండు గ్రామాల్లో మునుపెన్నడు లేని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, పాఠశాలలు, సోలార్‌ లైట్లు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, చెరువుల అభివృద్ధి లాంటి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలతో పారికర్‌ తరచూ మాట్లాడుతుండేవారు. కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసేవారు. మరిన్ని కార్యక్రమాలపై చర్చించడానికి దిల్లీ రావాలని కోరేవారు’’ అని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గ్రామ ప్రజలు గుర్తుచేసుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు