close

తాజా వార్తలు

బకాయిల చెల్లింపు.. లాభాల్లో ఆర్‌కామ్‌ షేర్లు

ముంబయి: ఎరిక్సన్‌ కంపెనీకి బకాయిల చెల్లింపుతో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) షేర్లు లాభాల బాట పట్టాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 10శాతం లాభంతో రూ. 4.4 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, హోమ్‌ ఫైనాన్స్‌, నావెల్‌, నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా 4-5శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. 
ఎరిక్సన్‌కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఈనెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి విదితమే. నిధులున్నప్పటికీ, తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో, ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ను గత ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది కూడా. బకాయిలు చెల్లించకపోతే అనిల్‌ను జైలుకు పంపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో గడువుకు ఒక్కరోజు ముందు అనిల్‌ ఈ మొత్తాన్ని ఎరిక్సన్‌కు చెల్లించారు. అనిల్‌ జైలుకు వెళ్లకుండా ఆయన అన్న ముకేశ్‌ అంబానీ ఈ ఆర్థిక సాయం చేశారు. విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అన్నావదినలు ముకేశ్‌, నీతాలకు అనిల్‌ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు