close

తాజా వార్తలు

ఈసారి ‘వెంకీ’ అండ్‌ వెంకీ..!

హైదరాబాద్‌: మల్టీస్టారర్‌ చిత్రంగా సంక్రాంతికి విడుదలైన ‘f2’తో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఇప్పుడు ఆయన మరో మల్టీస్టారర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈసారి మాస్‌ మహారాజా రవితేజతో కలిసి వెంకీ మల్టీస్టారర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బిందాస్’, ‘ఈడు గోల్డ్‌ ఎహే’ సినిమాలను తెరకెక్కించిన వీరు పొట్లా దర్శకత్వంలో వీరు నటించబోతున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇంకా స్క్రిప్ట్‌పై చర్చలు జరుగుతున్నాయట. మరి కొన్ని వారాల్లో సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాకు అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క వెంకటేశ్‌ ‘వెంకీ మామా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన మేనల్లుడు, సినీ నటుడు నాగచైతన్య కూడా నటిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు