close

తాజా వార్తలు

క్రికెట్‌ ఆడకుండా ఇంట్లో కూర్చోవడం మంచిదికాదు

బుమ్రాపై ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ జయవర్ధనే

ముంబయి: ఐపీఎల్‌ పూర్తైన పది రోజులకే ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్‌ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల విశ్రాంతికి సంబంధించి ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. టీమిండియా ఆటగాళ్లు ప్రపంచకప్‌ ముందు జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు తమ సామర్థ్యంపై ఎవరికి వారే తగిన నిర్ణయం తీసుకోవాలని భారత కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మహేళ జయవర్ధనే తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నాడు. ముఖ్యంగా బౌలర్ల విషయంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాడు.

భారత జట్టు ప్రధాన బౌలర్‌ జస్ప్రిత్‌బుమ్రా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయవర్ధనే పై విధంగా స్పందించాడు. బుమ్రా ఇంట్లో కూర్చోవడం కన్నా ఐపీఎల్‌లో ఆడటమే మంచిదని చెప్పాడు. సరైన ప్రణాళికతో ఆటగాళ్లు శారీరక శ్రమను జయించి మంచి క్రికెట్‌ ఆడాల్సిన అవసరముందన్నాడు. భారత జట్టు తమ ఆటగాళ్లకు ఈ మధ్య సరైన విశ్రాంతినిస్తుందని, దీంతో ఈసారి ప్రధాన ఆటగాళ్లు రాణించాల్సిన అవసరముందని వివరించాడు.

‘ఆటగాళ్లు ఇంట్లో కూర్చొని నేరుగా ప్రపంచకప్‌లో ఆడితే సరిగ్గా రాణించలేరు. సరైన ప్రణాళికతో మంచి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. బుమ్రా బౌలింగ్‌లో వైవిధ్యముంది. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టగలడు. ఆఖరి ఓవర్లలో పరుగులను నియంత్రించి వికెట్లు పడగొట్టే సత్తా అతడి సొంతం. కచ్చితంగా బుమ్రా గేమ్‌ చేంజర్‌గా నిలుస్తాడు’ అని జయవర్ధనే చెప్పుకొచ్చాడు.
 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు