close

తాజా వార్తలు

శంషాబాద్‌లో విమానానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి సౌదీ నుంచి వచ్చిన విమానం శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా.. లేజర్‌ లైటింగ్‌ వెలుగుల కారణంగా పైలట్‌ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాను పడుతున్న ఇబ్బందులను పైలట్‌ ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఎయిర్‌పోర్టుకు సమీపంలో రషీద్‌గూడలో శివమణి అనే యువకుడు లేజర్‌ లైటింగ్ వెలుగుల్లో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో లేజర్‌ షో లైటింగ్‌లను అధికారులు నిషేధించారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించినందుకు పోలీసులు శివమణిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు