close

తాజా వార్తలు

9ఏళ్ల వయసులో ఆయన ఆఫీస్‌లోకెళ్లాను

ఎంతో కాలం ఎదురుచూశాను.. కల నెరవేరింది: ఆలియా

ముంబయి: ఎప్పటినుంచో వెలువడుతున్న ఊహాగానాలకు ఈరోజు తెరపడింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌, ఆలియా భట్‌ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. అందులోనూ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాను తెరకెక్కించబోతున్నారు. బాలీవుడ్‌ అభిమానులకు ఇంతకన్నా మరో సర్‌ప్రైజ్‌ ఉండదనే చెప్పాలి. సినిమాకు ‘ఇన్‌షా అల్లా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆలియా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు భన్సాలీ సర్‌ ఆఫీస్‌లోకి అడుగుపెట్టాను. తన తదుపరి సినిమాలో ఆయన నాకు అవకాశం ఇస్తారా? లేదా? అని తెగ కంగారుపడిపోయాను. ఆ కల ఇంతకాలానికి నెరవేరింది. కళ్లు తెరిచే కలలు కనండి అంటుంటారు. నేను అదే చేశాను. సల్మాన్‌, భన్సాలీ సర్‌ల కాంబినేషన్‌లో మ్యాజిక్‌ ఉంటుంది. ఈ అందమైన ప్రయాణంలో భాగం కావాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. 11 ఏళ్ల తర్వాత భన్సాలీ, సల్మాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ‘ఇన్‌షా అల్లా’ సినిమా స్క్రిప్ట్‌ సిద్ధం చేయడానికే భన్సాలీకి తొమ్మిది నెలలు పట్టిందట. 2020 రంజాన్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు