close

తాజా వార్తలు

తెదేపాకు రాజీ‘నామా’

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫున నామా పోటీ చేశారు. తెరాస అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో తెదేపాకు మనుగడ లేదని భావించిన ఆయన అటు కాంగ్రెస్‌లో గానీ, తెరాసలో గానీ చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన తెరాస అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోనూ భేటీ అయ్యారు. దీంతో తెరాసలో చేరిక ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం ఎంపీగా ఆయనను బరిలోకి దింపాలని తెరాస యోచిస్తోంది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు