close

తాజా వార్తలు

అప్పుడు ఛాయ్‌వాలా..ఇప్పుడు చౌకీదారా?

ప్రధాని నరేంద్ర మోదీపై మాయావతి విమర్శలు

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్‌ ఖాతాలో ‘చౌకీదార్‌(కాపలాదారు)’ అని చేర్చుకోవడంపై బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం మోదీ చౌకీదార్‌ అని చేర్చుకోవడంతో భారతీయ జనతాపార్టీ నేతలు ఆయన బాటలో నడిచారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు సైతం వారి పేర్ల ముందు చౌకీదార్‌ అని చేర్చుకుంటున్నారు. అయితే పరిణామాలన్నింటిపై మాయావతి మంగళవారం ట్వీట్‌ చేశారు.

‘‘మై భీ చౌకీదార్‌’ అంటూ భాజపా ప్రచారం మొదలు పెట్టిన వెంటనే చాలామంది వారివారి ట్విటర్‌ ఖాతాల్లో చౌకీదార్ అనే పేరును జోడించుకున్నారు. అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కాపలాదారుడు మాత్రమే ఛాయ్‌వాలా కాదు. గత ఎన్నికలప్పుడు ఛాయ్‌వాలా ఇప్పుడు కాదు. భాజపా అధికారంలో దేశం ఎంతలా మారిపోయిందో స్పష్టంగా కనిపిస్తోంది’ అని మాయా ప్రధానిని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఛాయ్‌వాలా అనే పదాన్ని ఉపయోగించి భాజపా ప్రచారం సాగించింది. గత కొన్ని రోజులుగా తాను దేశానికి కాపలాదారునని మోదీ చెప్పుకొంటూ వస్తున్నారు. దీంతో ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. కాపలా దారు దొంగగా మారారంటూ రాహుల్‌ ఆరోపిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు