close

తాజా వార్తలు

భాజపా ఆరోపణలకు కాలం చెల్లింది: ప్రియాంక

లఖ్‌నవూ: కాంగ్రెస్‌పై భాజపా చేస్తున్న ఆరోపణలకు కాలం చెల్లిందని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసిన ప్రియాంక.. భాజపాపై చేస్తున్న విమర్శల్లో పదును పెంచారు. కాంగ్రెస్‌ను నిందించడం ఆపి గత ఐదు సంవత్సరాల్లో  భాజపా ఏం చేసిందో చెప్పాల్పిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనే కారణమని భాజపా పదే పదే చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహీలోని మంగళవారం ఆమె పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. యూపీలో పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దీన్ని అవకాశంగా మార్చుకోవాలని సూచించారు. 2019లో తప్పకుండా ప్రభుత్వం మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ పనితీరు పట్ల యువత, ఉద్యోగులు, రైతులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యల్ని ..ఆమె అబద్ధాలుగా అభివర్ణించారు. అభివృద్ధి మొత్తం నివేదికలు, ప్రచారాల్లో మాత్రమే ఉందని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా ప్రియాంక గాంధీ పనిచేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రయాగరాజ్‌ జిల్లాలోని కఛ్‌నర్‌ తెహసీల్‌లో ఉన్న మనయ్య ఘాట్‌ నుంచి ఆమె గంగాయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రసంగాల కంటే ప్రజలు కష్టాలు నేరుగా తెలుసుకోవడమే మేలని భావించి ఈ యాత్ర చేపట్టానని పేర్కొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు