close

తాజా వార్తలు

సామాజిక మాధ్యమాలకు కళ్లెం వేయనున్న కోడ్‌

న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళిలో పేర్కొన్న విధివిధానాలపై వివరించేందుకు, కొత్త నిబంధనల అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం నేడు అన్ని సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ కానుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సామాజిక మాధ్యమాలన్నీ సహకరించాలని ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తున్న సమయంలోనే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడా కోరారు. తప్పుడు ఖాతాలను తొలగించడానికి, తప్పుడు వార్తలను, ప్రచారాలను అరికట్టడానికి నిజనిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో అభ్యర్థులు ఇచ్చే ప్రకటనల విషయంలో ఆయా సంస్థలు అనుసరించాల్సిన ప్రత్యేక నియమ నిబంధనలను వారికి తెలియజేస్తామని ఈసీ బొంబాయి హైకోర్టుకు చెప్పిన మరునాడే ఈ సమావేశాన్ని ఖరారు చేశారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించకుంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌ వంటి దిగ్గజ సంస్థలు ఎన్నికల సందర్భంగా ఇప్పటికే తాము అనుసరిస్తున్న విధానాలను ఈసీ ముందు ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈసీకి పూర్తిగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు