close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ యువరాజు ఆ విషయాన్ని గ్రహించాలి

దిల్లీ: శాంతియుతంగా నినాదాలు చేస్తూ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద నిరసన తెలిపిన ఆందోళనకారులను అరెస్ట్ చేయడంపై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం తమను వ్యతిరేకించే వారిని భయాందోళనలకు గురిచేస్తోందని మంగళవారం విమర్శించారు. ‘‘అవాంతరాలు సృష్టించేవారిని దగ్గరికి చేర్చుకుంటున్నారు. శాంతియుతంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వాక్‌ స్వాతంత్ర్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చే వారు ఎక్కడున్నారు? యువతకు ఏం కావాలో వారు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్‌ యువరాజు గ్రహించాలి. వారిని భయపెట్టడం మానేయాలి. వారు మీ స్టైల్ రాజకీయాలకు వ్యతిరేకం’’ అని ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

సోమవారం బెంగళూరులో వ్యాపారవేత్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు మోదీ అనుకూల నినాదాలు చేయడంతో పాటు, రాహుల్‌ వేదిక దిగి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భాజపా ఆ ఆందోళనకారులను టెకీలని చెబుతోంది. పోలీసుల చర్యపై ఆ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు