close

తాజా వార్తలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గెలిపించాలని ఉంది

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మంచి విజయాలను అందించాలనుందని అంటున్నాడు కేరళ యువ పేసర్‌ బసిల్‌ తంపి. మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో సత్తాచాటి జట్టుని గెలుపుబాటలో నిలపాలని భావిస్తున్నట్లు తెలిపాడు. పీటీఐతో మాట్లాడిన తంపి తన అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించాడు. ‘ఈ సీజన్‌లో బాగా రాణించాలని ఉంది. ఒక వేళ నాకు అవకాశం వస్తే ఈసారి మంచి బంతులేసి వికెట్లు తీస్తా. సన్‌రైజర్స్‌ జట్టుకి మంచి విజయాలను అందించాలని ఉంది. గతేడాది ఈ జట్టుతో ఆడి చాలా విషయాలను నేర్చుకున్నా’ అని తంపి వివరించాడు.
ఇంకా మాట్లాడుతూ.. తాను మంచి యార్కర్లు వేయగలనని, యార్కర్లు వేసేందుకే పరిమితమైపోతానని చెప్పాడు. అలాగే కొన్ని వైవిధ్య బంతుల్ని వేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఫిట్‌నెస్‌ సాధించడం ఎలాగో సీనియర్ల నుంచి నేర్చుకున్నానని, నమ్మకంతో బౌలింగ్‌ చేయడమే ఐపీఎల్‌లో ముఖ్యమని చెప్పాడు. ‘ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు. ఇక్కడంతా మొత్తం బ్యాట్స్‌మెన్‌దే ఆట. ఆ విషయం బాగా తెలుసు. బౌలింగ్‌ చేయడానికి పూర్తినమ్మకం ఉండాలి. అప్పుడే బాగా రాణిస్తాం. గత మూడేళ్లుగా నేను నేర్చుకుంది అదే. నా చేతికి బంతి దొరికితే అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయాలనుకుంటా. అలాగే సహచర బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ మేమంతా ఇండియా ఎ తరఫున ఆడతాం. మా ఆలోచనలు అందరితో పంచుకుంటాం’ అని తంపి పేర్కొన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మార్చి 24న కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడనుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు