close

తాజా వార్తలు

డబ్బులేకపోయినా.. కేసీఆర్‌పై పోరాడే దమ్ముంది!

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌: తెరాసలో చేరుతున్న నేతలెవరూ ప్రగతి భవన్‌లోకి వెళ్లలేరని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోవడం మంచిదికాదన్నారు. మంగళవారం మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ప్రతిపక్షం లేకపోతే నియంతృత్వానికి దారితీస్తుందని తెలిపారు. తనవద్ద డబ్బు లేకపోయినా..  సీఎం కేసీఆర్‌పై పోరాడే దమ్ము మాత్రం ఉందన్నారు.

తెరాస బెదిరింపులకు ఎవరూ భయపడొద్దు: మల్‌రెడ్డి
ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి కాంగ్రెస్‌ను మోసం చేసి తెరాసలోకి వెళ్లారని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ధైర్యం ఉంటే  సుధీర్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలోకి వెళ్లాలని సవాల్‌ చేశారు. తెరాస బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని సూచించారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు