close

తాజా వార్తలు

మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ప్రతిపక్షనేత హోదా నుంచి తప్పుకున్న రాధాకృష్ణ విఖే పాటిల్‌

ముంబయి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న ఆ పార్టీ నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌ ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ నాయకత్వానికి ఓ లేఖ పంపారు. దీనిపై వారు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం ఆయన కుమారుడు సుజయ్‌ విఖే పాటిల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ కూడా పార్టీని వీడతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన వాటిని ఖండిస్తూ వస్తున్నారు.

రాధాకృష్ణ కుమారుడు సుజయ్‌కు భాజపా అహ్మద్‌నగర్‌ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ తనకు ఇవ్వని కారణంగానే పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఆ స్థానాన్ని ఎన్సీపీకి కేటాయించింది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు