close

తాజా వార్తలు

రేపు బలపరీక్ష ఎదుర్కోనున్నసావంత్ ప్రభుత్వం

పనాజీ:  శాసనసభలో బుధవారం తమ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోనుందని గోవా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  ప్రమోద్‌ సావంత్ తెలిపారు. భాజపా, మిత్రపక్షాల మధ్య అనేక చర్చలు జరిగిన అనంతరం, సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనారోగ్యంతో మనోహర్‌ పారికర్‌ కన్నుమూయడంతో గోవాలో ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టనున్నారో అన్న ఉత్కంఠ సోమవారం నెలకొంది. అయితే రాష్ట్రంలో మిత్ర పక్షాలైన ఎంజీపీ, జీఎఫ్‌పీకి చెరో ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించడంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. కూటమిలో ఉన్న ఎంజీపీకి చెందిన సుదిన్‌ ధవిలికర్‌, జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌ సర్దేశాయ్‌కు ఉపముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన సావంత్‌కు పారికర్‌ మరణించడంతో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది.  

 గోవాలో మొత్తం 40 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 14, భాజపాకు 12, ఎంజీపీకు 3, జీఎఫ్‌పీకు 3,  ఎన్సీపీకి 1 సభ్యుల బలం ఉంది. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు