close

తాజా వార్తలు

వరుసగా ఏడో రోజు.. బుల్‌ జోరు

ముంబయి: దలాల్‌స్ట్రీట్ లాభాలతో కళకళలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు పెరగడంతో వరుసగా ఏడో రోజు సూచీలు లాభాల్లో పరుగులు పెట్టాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 11,500 మార్క్‌ పైన స్థిరపడింది.
కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 38,218 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 38,396 గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 268 పాయింట్ల లాభంతో 38,363 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్లు ఎగబాకి 11,510 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.94గా కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబరు 7 తర్వాత సూచీలు గరిష్ఠస్థాయిలను తాకడం మళ్లీ ఇప్పుడే. నేటి ట్రేడింగ్‌లో మౌలిక, రియాల్టీ, బ్యాంకింగ్‌, విద్యుత్‌ రంగ షేర్లు రాణించాయి. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు