close

తాజా వార్తలు

కమల్‌ పార్టీని వీడిన మరో ఇద్దరు నాయకులు

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌నీది మయ్యమ్‌ పార్టీలో అసంతృప్తుల జాబితా పెరుగుతోంది. పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత రాజకీయాలను కారణంగా చూపుతూ మరో ఇద్దరు నాయకులు పార్టీని వీడారు. ఒకరు యూత్ వింగ్ సెక్రటరీ నవీన్‌ కార్తిక్‌ కాగా, మరో వ్యక్తి కడలూర్‌ జిల్లా ఇంఛార్జి వెంకటేశన్.‌ ఇదే కారణంతో సోమవారం సీకే కుమారవేల్‌ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన కమల్ హాసన్‌ పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వేల్‌  మాట్లాడుతూ..‘నాలాగే చాలా మంది కమల్ హాసన్‌ పట్ల అసంతృప్తితో ఉన్నారు. కమల్‌, ఆఫీస్‌ బేరర్ల మధ్య సరైన సంబంధాలు లేవు. వాట్సాప్‌ సందేశాల ఆధారంగా పార్టీ నడుస్తోంది’ అని ఆరోపించారు. ఆ వెంటనే ఎంఎన్‌ఎం పార్టీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా  ప్రవర్తించడం వల్లే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలిపింది. ఇంతవరకు అభ్యర్థుల పేర్లు ఖరారు కాకముందే ఆయన పోటీ చేసే స్థానంపై వేల్‌ ప్రకటన చేసి నిబంధనలను ఉల్లంఘించారని దానిలో పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి 20న పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు