close

తాజా వార్తలు

బిల్లు కట్టకుండా పారిపోయిన నటి

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ బిల్లు కట్టకుండా హోటల్‌ నుంచి పారిపోయారు. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో ఆమె కొన్ని రోజులు బస చేశారు. బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకున్న ఆమె పూర్తిగా చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఈ విషయం గుర్తించిన హోటల్‌ యాజమాన్యం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. అయితే రూ. 2లక్షలు చెల్లించానని పూజా పోలీసులతో అన్నట్లు తెలిసింది. మొత్తం డబ్బు చెల్లించేందుకు కాస్త సమయం ఇవ్వమని హోటల్‌ యాజమాన్యాన్ని నటి కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కొన్ని రోజులు గడువు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇలా పూజా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటి సారి కాదు. 2011లో ఆమె ప్రముఖ నిర్మాత కిరణ్‌తో గొడవ పెట్టుకున్నారు. డబ్బు విషయంలో వీరిద్దరికీ కలహాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ఇద్దరు ఒకరిపై మరొకరు పరువు నష్టం కేసు పెట్టుకున్నారు. పూజా 2002లో హిందీ సినిమా ‘దుష్నని’తో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 30 కన్నడ చిత్రాల్లో నటించారు. ‘దండుపాళ్యం’ సిరీస్‌లలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు