close

తాజా వార్తలు

లక్ష్మీనారాయణ పోటీపై జనసేన ప్రకటన

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దించుతున్నట్టు వెల్లడించారు.
నాలుగో విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా..
విశాఖ ఉత్తరం - పసుపులేటి ఉషాకిరణ్‌
విశాఖ దక్షిణం - గంపల గిరిధర్‌
విశాఖ తూర్పు - కోన తాతారావు
భీమిలి - పంచకర్ల సందీప్‌
అమలాపురం - శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం - తుమ్మల రామస్వామి (బాబు)
పోలవరం - చిర్రి బాలరాజు
అనంతపురం - టి.సి.వరుణ్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు