close

తాజా వార్తలు

ఘనంగా ‘నెల నెలా తెలుగు వెన్నెల’

టెక్సాస్‌( అమెరికా) : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 140 వ సాహిత్య సదస్సు ఆదివారం (మార్చి 17) డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి  డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘తెలుగుతో నా పోరాట కథ’ అనే అంశం మీద ఈయన మాట్లాడారు. అనంతరం ఈయనను పుష్పగుచ్ఛాలు, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి, మీడియాకు సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, ఇతర కార్యవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి , పవన్ నెల్లుట్ల , సాహిత్య వేదిక కమిటీ సభ్యులు స్వర్ణ అట్లూరి, శ్రీ బసాబత్తిన ,డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు