close

తాజా వార్తలు

అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్నారు..

భాజపా నేతలపై రాబర్ట్‌ వాద్రా విమర్శలు

న్యూదిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతలపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. మహిళా నేతలపై వారు చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళల సమానత్వం కోసం, భాజపా తీరుకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మన దేశంలోని మహిళలపై అభ్యంతరకర రీతిలో భాజపా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ ప్రజలంతా మేల్కోవాలి. దేశంలోని మహిళలకు మంచి భవిష్యత్తు, సమానత్వం అందించేలా పోరాడాలి. ఇటువంటి మహిళా వ్యతిరేక తీరు, భావజాలాన్ని రూపుమాపాల్సి ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాల్సి ఉంది’ అని ఆయన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. పలువురు భాజపా నేతలు బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

కాగా, సోమవారం కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు గుప్పిస్తూ  వ్యాఖ్యలు చేశారు. అలాగే, భాజపా ఉత్తర్‌ప్రదేశ్‌ ఎమ్మెల్యే సురేంద్ర నారాయణ్‌ సింగ్‌.. మాయావతిపై విమర్శలు గుప్పిస్తూ... ముఖానికి మేకప్‌ వేసుకుంటారని, తలకి రంగు వేసుకుంటారని అన్నారు. వీటిపై స్పందించిన వాద్రా ఈ విధంగా విమర్శలు చేశారు. కాగా, కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతూ, భాజపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.  


 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు